Share News

కార్యకర్తలు అలిగినప్పుడల్లా నష్టం

ABN , Publish Date - Jul 19 , 2026 | 03:46 AM

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే కొండంత బలమని, వారు అలిగినప్పుడల్లా పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని చంద్రబాబు అన్నారు.

కార్యకర్తలు అలిగినప్పుడల్లా నష్టం

ఇంటర్నెట్ డెస్క్: తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే కొండంత బలమని, వారు అలిగినప్పుడల్లా పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని చంద్రబాబు అన్నారు. గుడివాడలో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. 2004లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఉంటే రాష్ట్ర పరిస్థితి మరోలా ఉండేదన్నారు. గుడివాడ నియోజకవర్గాన్ని ఒక నాయకుడు చెడగొడితే, వెనిగండ్ల రాము అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారన్నారు. గత రెండేళ్లలో చేసిన పనులు గత 20 ఏళ్లలో జరగలేదన్నారు. ఎవరు తప్పు చేసినా అది మొత్తం పార్టీకి చుట్టుకుంటుందన్నారు. పార్టీకి నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Jul 19 , 2026 | 03:47 AM