ఎవరు తప్పు చేసినా ఉపేక్షించం
ABN , Publish Date - Jul 19 , 2026 | 03:35 AM
శ్రీకాకుళంలో ఒక మాజీ మంత్రి కుమారుడు వాహనంతో గొర్రెల కాపరిని ఢీకొడితే బాధితుడు చనిపోయాడని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ఆ మాజీ మంత్రి..
ఇంటర్నెట్ డెస్క్: శ్రీకాకుళంలో ఒక మాజీ మంత్రి కుమారుడు వాహనంతో గొర్రెల కాపరిని ఢీకొడితే బాధితుడు చనిపోయాడని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ఆ మాజీ మంత్రి వేరే వ్యక్తి వాహనం నడిపినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని చంద్రబాబు విమర్శించారు. గుంటూరులో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవల కారణంగా టీడీపీకి చెందిన ఓ వ్యక్తి మహిళపై దాడి చేయించాడని, అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పారు. సదరు నేతకి సహకరించిన పోలీసులను బదిలీ చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. తన స్నేహితుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యుల పట్ల గొడ్డలి పార్టీ అసభ్యకరంగా పోస్టులు పెట్టించిందని విమర్శించారు.