Share News

చంద్రబాబు ఎన్‌ఎస్‌జీ కమాండోకు వడదెబ్బ

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:08 AM

బెజవాడ.. వేసవిలో బ్లేజ్‌వాడగా మారుతుంది! సోమవారం తీవ్రమైన ఎండ వేడిమితో ముఖ్యమంత్రికి భద్రతగా ఉండే ఎన్‌ఎ్‌సజీ కమాండో ఒకరు వడదెబ్బకు గురయ్యారు.

చంద్రబాబు ఎన్‌ఎస్‌జీ కమాండోకు వడదెబ్బ

  • బెజవాడలో ఠారెత్తిన ఎండ.. కింద పడబోయిన కమాండో

  • పట్టుకున్న సీఎం, కలెక్టర్‌ లక్ష్మీశ.. చుట్టూ కొండలతో.. బెజవాడకు సెగ

విజయవాడ, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): బెజవాడ.. వేసవిలో బ్లేజ్‌వాడగా మారుతుంది! సోమవారం తీవ్రమైన ఎండ వేడిమితో ముఖ్యమంత్రికి భద్రతగా ఉండే ఎన్‌ఎస్‌జీ కమాండో ఒకరు వడదెబ్బకు గురయ్యారు. డీహైడ్రేషన్‌కు గురై పడిపోబోయారు. అయితే.. ముఖ్యమంత్రి సహా జిల్లా కలెక్టర్‌ ఆయనను పట్టుకుని.. తక్షణం వైద్యం అందించేలా చూశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన 76వ పుట్టిన రోజును పురస్కరించుకుని విజయవాడ పటమటలో అన్న క్యాంటీన్‌కు సతీమణి భువనేశ్వరితో కలిసి వచ్చారు. అయితే.. అప్పటికే ఎండ వేడిమి పెరగడంతో చంద్రబాబుకు భద్రతగా పక్కనే ఉన్న ఎన్‌ఎ్‌సజీ కమాండో డీహైడ్రేషన్‌కు గురై.. కిందపడబోయారు. ఈ పరిణామంతో సీఎం చంద్రబాబు కమాండోను ఎవరైనా తోసారేమోనని వెనక్కి చూశారు. వెనుక ఎవరూ తోయలేదని గుర్తించి.. పడిపోతున్న కమాండోను లిప్తకాలంలో ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ, చంద్రబాబు.. ఇద్దరూ చేతులు పట్టుకుని కాపాడారు. సీఎం కాన్వాయ్‌లోని అంబులెన్స్‌లోనే కమాండోకు వైద్యం అందించారు. కాగా, ఏదో సాధారణ వ్యక్తి డీ హైడ్రేషన్‌కు గురై పడిపోయారంటే అనుకోవచ్చు. ఎలాంటి వాతావరణంలో అయినా పనిచేయగల సుశిక్షితులైన ఎన్‌ఎస్‌జీ కమాండోనే ఎండ దెబ్బకు డీహైడ్రేషన్‌కు గురికావటం విజయవాడలో ఎండ తీవ్రతకు అద్దం పట్టింది.

Updated Date - Apr 21 , 2026 | 04:09 AM