Share News

స్వీయ జనగణనలో సీఎం కుటుంబ వివరాలు నమోదు

ABN , Publish Date - Apr 17 , 2026 | 05:38 AM

స్వీయ జనగణన ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ప్రజలంతా జనగణనలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

స్వీయ జనగణనలో సీఎం కుటుంబ వివరాలు నమోదు

  • ఈ ప్రక్రియలో ప్రజలంతా భాగస్వాములు కావాలి: చంద్రబాబు

స్వీయ జనగణన ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ప్రజలంతా జనగణనలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. హౌస్‌ లిస్టింగ్‌ - హౌస్‌ సెన్సెస్‌ కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్‌ ద్వారా వివరాల నమోదు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. se.census.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ముఖ్యమంత్రి తన కుటుంబ వివరాలు నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ స్వీయ జనగణన ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్‌ జె.నివాస్‌ సీఎంకి వివరించారు. ఈ నెల 30 వరకు ప్రజలు స్వయంగా ఆన్‌లైన్‌లో తమ ఇళ్లకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామని ముఖ్యమంత్రికి తెలిపారు.

Updated Date - Apr 17 , 2026 | 05:39 AM