టీటీడీ అటవీ సంరక్షణ చర్యలు భేష్: చంద్రబాబు
ABN , Publish Date - May 19 , 2026 | 06:17 AM
అటవీ సంరక్షణ చర్యలను సమర్థంగా అమలు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను సీఎం చంద్రబాబు ప్రశంసించారు.
తిరుపతి(టీటీడీ), మే 18(ఆంధ్రజ్యోతి): అటవీ సంరక్షణ చర్యలను సమర్థంగా అమలు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఈ మేరకు టీటీడీ ట్విట్టర్‌ను ట్యాగ్ చేస్తూ ఆయన ఒక పోస్టు పెట్టారు. ‘టీటీడీ శేషాచల అడవులను సంరక్షిస్తూ స్థానిక మొక్కలను పెంచుతోంది. ఈ సుస్థిర చర్యల ద్వారా తిరుమలలో 89.4ు అటవీ విస్తీర్ణం సాధించింది. మన సంప్రదాయాలు ప్రకృతిని పవిత్రమైనదిగా భావించి పూజలు చేస్తాయి. అడవులను, వన్యప్రాణులను రక్షించడం అంటే ఆ దైవానికి చేసే సేవగా మనం పరిగణిస్తాం. టీటీడీ ప్రయత్నాలను అభినందిస్తున్నా. టీటీడీ తీసుకున్న చర్యలు రాబోయే తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన తిరుమలను అందించడంలో సహాయపడతాయి’ అని లోకేశ్ పేర్కొన్నారు.