Share News

‘సేల్‌’.. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం: సీఎం

ABN , Publish Date - May 23 , 2026 | 05:07 AM

రాష్ట్రంలో స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌.. స్పీడ్‌ ఆఫ్‌ ఎగ్జిక్యూషన్‌ ఎలా అమలవుతున్నాయో.. సుఖ్‌బీర్‌ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్‌(సేల్‌) సోలార్‌ ప్రాజెక్టు ద్వారా..

‘సేల్‌’.. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం: సీఎం

అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌.. స్పీడ్‌ ఆఫ్‌ ఎగ్జిక్యూషన్‌ ఎలా అమలవుతున్నాయో.. సుఖ్‌బీర్‌ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్‌(సేల్‌) సోలార్‌ ప్రాజెక్టు ద్వారా నిరూపితమైందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమలో సుమారు రూ.3 వేల కోట్ల భారీ పెట్టుబడితో.. 600 మెగావాట్ల భారీ సోలార్‌ ప్రాజెక్టును కేవలం 11 నెలల రికార్డు సమయంలోనే నిర్మాణం పూర్తి చేసి, ప్రజలకు అంకితం చేయడం రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు.

Updated Date - May 23 , 2026 | 05:07 AM