Share News

హెల్మెట్‌ బ్యాంక్‌ భేష్‌.. బుల్లెట్‌ ఎక్కిన చంద్రబాబు

ABN , Publish Date - May 17 , 2026 | 04:59 AM

శ్రీకాకుళం జిల్లాలో ద్విచక్ర వాహన ప్రమాదాలను నివారించేందుకు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌, పోలీసు శాఖ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ‘హెల్మెట్‌ బ్యాంక్‌’ విధానాన్ని సీఎం ఎంతగానో అభినందించారు.

హెల్మెట్‌ బ్యాంక్‌ భేష్‌.. బుల్లెట్‌ ఎక్కిన చంద్రబాబు

ఇంటర్నెట్ డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో ద్విచక్ర వాహన ప్రమాదాలను నివారించేందుకు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌, పోలీసు శాఖ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ‘హెల్మెట్‌ బ్యాంక్‌’ విధానాన్ని సీఎం ఎంతగానో అభినందించారు. హెల్మెట్‌ లేని వారికి రెండు మూడు రోజులపాటు ఉచితంగా హెల్మెట్‌ ఇచ్చి, వారు కొత్తది కొనుక్కున్నాక తిరిగి తీసుకునే ఈ విధానాన్ని జిల్లా అంతటా అమలు చేయాలన్నారు. ఉత్సాహంతో స్వయంగా హెల్మెట్‌ ధరించి బుల్లెట్‌ వాహనంపై కూర్చొని చంద్రబాబు సందడి చేశారు. కాగా, పొదుపు చర్యల్లో భాగంగా సీఎం నాలుగు వాహనాల కాన్వాయ్‌లో ఈ జిల్లాలో పర్యటించారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, నారాయణ, కొండపల్లి శ్రీనివాస్‌, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ పట్టాభి, పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కాంతీలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2026 | 05:02 AM