Share News

జీఎన్‌ నాయుడికి సీఎం నివాళి

ABN , Publish Date - May 03 , 2026 | 05:22 AM

పారిశ్రామికవేత్త, రీజెన్సీ గ్రూప్‌ అధినేత జీఎన్‌ నాయుడుకి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని నాయుడు నివాసానికి శనివారం ఉదయం వెళ్లిన సీఎం చంద్రబాబు..

జీఎన్‌ నాయుడికి సీఎం నివాళి

  • రీజెన్సీ అధినేత కుటుంబానికి రాధాకృష్ణ పరామర్శ

అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): పారిశ్రామికవేత్త, రీజెన్సీ గ్రూప్‌ అధినేత జీఎన్‌ నాయుడుకి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని నాయుడు నివాసానికి శనివారం ఉదయం వెళ్లిన సీఎం చంద్రబాబు.. ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో నాయుడు కృషి ఎనలేనిదని సీఎం అన్నారు. సమాజ సేవకు నాయుడు తన వంతు కృషి చేశారని చెప్పారు. ఈ సందర్భంగా జీఎన్‌ నాయుడుతో తనకున్న పరిచయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. మంత్రి లోకేశ్‌, ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ... జీఎన్‌ నాయుడికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

Untitled-6 copy.jpg

Updated Date - May 03 , 2026 | 05:26 AM