Share News

బాలయోగికి సీఎం నివాళి

ABN , Publish Date - Mar 04 , 2026 | 04:04 AM

లోక్‌సభ తొలి దళిత స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత దివంగత జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.

బాలయోగికి సీఎం నివాళి

అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ తొలి దళిత స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత దివంగత జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. బాలయోగి.. సామాన్య కుటుంబంలో జన్మించి లోక్‌సభ స్పీకర్‌గా ఎదిగిన అసాధారణ ప్రతిభాశాలి అని, దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. మంత్రి లోకేశ్‌ కూడా బాలయోగికి నివాళులర్పించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాలయోగి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్‌రెడ్డి, టీడీపీ కార్యాలయ కార్యదర్శి అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2026 | 04:06 AM