మెరుగైన వైద్యం అందించండి: సీఎం ఆదేశం
ABN , Publish Date - Feb 25 , 2026 | 05:24 AM
శ్రీకాకుళంలో డయేరియా బాధితులందరికి మెరుగైన వైద్యం అందించాలని, వెంటిలేటర్‌పై ఉన్న ఇద్దరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలో డయేరియా బాధితులందరికి మెరుగైన వైద్యం అందించాలని, వెంటిలేటర్‌పై ఉన్న ఇద్దరి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళంలో డయేరియా ఘటనపై మంగళవారం ఆయన సమీక్షించారు. జిల్లా అధికారులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. శ్రీకాకుళం నగరంలోని రోడ్డు మరమ్మతుల కారణంగా డయేరియా వ్యాపించిందని అధికారులకు సీఎంకు వివరించారు. ఈ ఘటనలో 65 మంది వివిధ ఆస్పత్రుల్లో చేరారని.. ఎనిమిది మంది డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 55 మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం వారికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామన్నారు. మరో 79 మందిలో డయేరియా లక్షణాలు గుర్తించామని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరం లేదని గుర్తించినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. వ్యాధి మరింత ప్రబలకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా చంద్రబాబు అధికారులను ఆదేశించారు.