ఎడమ కాలువ పనులకు అడ్డంకులు తొలగించండి
ABN , Publish Date - Aug 07 , 2026 | 04:40 AM
పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించేందుకు అడ్డంకిగా ఉన్న బెండపూడి, అరెంపూడి జాతీయ రహదారుల క్రాసింగ్ పనులు చేపట్టేందుకు..
నేషనల్ హైవే అధికారులను కోరిన సీఎం చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించేందుకు అడ్డంకిగా ఉన్న బెండపూడి, అరెంపూడి జాతీయ రహదారుల క్రాసింగ్ పనులు చేపట్టేందుకు సహకరించాలని జాతీయ రహదారుల సంస్థ రీజినల్ అధికారి ఆర్కే సింగ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ రెండు చోట్లా ఎన్‌హెచ్ అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడంతో గోదావరి జలాలు అక్కడిదాకా వచ్చి ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు, జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తిని ఆర్కే సింగ్ కలిశారు. రెండు చోట్లా త్వరితగతిన అనుమతి ఇస్తే ఈ నెల 24 నాటికి పనులు పూర్తవుతాయని సీఎం చెప్పారు. దీనిని వెంటనే ఆమోదం తెలియజేస్తానని ఆర్కే సింగ్ తెలిపారు.