ఫొటో జర్నలిస్టుగా సీఎం
ABN , Publish Date - Aug 20 , 2026 | 03:36 AM
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫొటో జర్నలిస్టులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రను నమోదు చేస్తూ..
ఫొటోగ్రఫీ డే సందర్భంగా కెమెరా చేతబట్టి.. ఫొటో తీసిన సీఎం
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫొటో జర్నలిస్టులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రను నమోదు చేస్తూ, జ్ఞాపకాలను పదిలపరుస్తున్న ఫొటోగ్రాఫర్లకు అభినందనలు అని సీఎం పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీ ప్రాంగణంలో తనను కలిసేందుకు వచ్చిన ఫొటోగ్రాఫర్లతో సీఎం సరదాగా ముచ్చటించారు. ఫొటోగ్రాఫర్ నుంచి కెమెరా తీసుకుని, ఫొటో జర్నలిస్టుగా మారి ఫొటోగ్రాఫర్లను గ్రూప్ ఫొటో తీశారు. పేరుపేరునా అందరినీ పలుకరించి వారితో విడివిడిగా ఫొటోలు దిగారు.