చంద్రబాబు బిజీ బిజీ.
ABN , Publish Date - Sep 24 , 2026 | 06:41 AM
ఈ నెల 29 నుంచి ఐదు రోజుల పాటు సీఎం చంద్రబాబు వరుస కార్యక్రమాలు, పర్యటనల్లో పాల్గొననున్నారు. 29 న ఉదయం విజయవాడలో డీఓపీటీ కర్మయోగి మిషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ నెల 29 నుంచి ఐదు రోజుల పాటు సీఎం చంద్రబాబు వరుస కార్యక్రమాలు, పర్యటనల్లో పాల్గొననున్నారు. 29 న ఉదయం విజయవాడలో డీఓపీటీ కర్మయోగి మిషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగే పల్లె పండుగ కార్యక్రమానికి హాజరవుతారు. 30న విజయవాడలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. 24 వేలమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. అక్టోబరు 1న ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొని పింఛన్లు పంపిణీ చేస్తారు. 2వ తేదీన మదనపల్లెలో హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన తర్వాత స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో నిర్వహించే వార్షిక స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. 3వ తేదీన విజయవాడలో పాన్ ఐఐటీ సదస్సుకు హాజరవుతారు.