నేడు, రేపు తమిళనాడులో బాబు
ABN , Publish Date - Apr 20 , 2026 | 04:37 AM
తమిళనాడులో ఎన్డీయే భాగస్వామ్యపక్ష పార్టీల అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు వెళుతున్నారు.
ఎన్టీయేపక్ష అభ్యర్థుల తరఫున సీఎం ప్రచారం
అమరావతి, ఏప్రిల్ 19(ఆంధ్రజ్యోతి): తమిళనాడులో ఎన్డీయే భాగస్వామ్యపక్ష పార్టీల అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు వెళుతున్నారు. 20, 21 తేదీల్లో అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 20వ తేదీ మధ్యాహ్నం అమరావతి నుంచి బయల్దేరి వెళ్లనున్న సీఎం మధ్యాహ్నం ఒంటి గంటకు కోయంబత్తూరు ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం హోసూరు నుంచి తళ్లి చేరుకుని సాయంత్రం 4.45 గంటలకు ప్రచార ర్యాలీకి హాజరవుతారు. రాత్రికి చెన్నై చేరుకుని ఆవడిలో నిర్వహించే రోడ్‌షోలో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేసి 21వ తేదీ ఉదయం చెన్నై నుంచి మదురై చేరుకుంటారు. రెండో రోజు మదురై -సాత్తూర్‌లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. సాయంత్రం 5.15 గంటలకు మదురై నుంచి హైదరబాద్ బయలుదేరి వెళ్తారు.