జెన్-జీ కాదు.. గొడ్డలి-జే
ABN , Publish Date - Aug 08 , 2026 | 04:45 AM
డీఎస్సీ నియామకాలను సైతం గొడ్డలి పా ర్టీ రాజకీయం చేస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘‘ఒక తరం భవిష్యత్తును నాశనం చేసిన పార్టీ అది. జెన్ జీ కాదు గొడ్డలి-జె. గొడ్డలి అరాచకాలను ఉపేక్షించేది లేదు.
నేరాలు చేసే వాళ్లను ప్రోత్సహిస్తున్న వైసీపీ
నాలుకకు ఇన్ని మడతలుంటాయని తెలియదు
జగన్ బయటికి వస్తే అరాచకం, విధ్వంసం
‘పొగాకు’ పరామర్శలో కుమ్ములాట.. గాయపడిన ఓ వ్యక్తి మృతి
సీబీఎన్ అంటేనే లా అండ్ ఆర్డర్...కఠినంగా ఉంటాం.. చీరాల సభలో ముఖ్యమంత్రి ఫైర్
గొడ్డలి పార్టీ కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నా, వాటన్నింటినీ అధిగమించి 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశాం. ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు పేపర్ లీక్ అంటూ కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. కోర్టు చీవాట్లు పెట్టినా ధర్నాల పేరిట నాటకాలాడుతున్నారు. పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్లి అక్కడ అరాచకం సృష్టించారు. బ్రాందీ షాపుల్లో మద్యం తాగి బట్టలు విప్పి డ్యాన్సులు చేస్తూ గొడ్డలి పార్టీ గ్యాంగ్ వికృతంగా ప్రవర్తించింది. ఓ దుకాణాన్ని ధ్వంసం చేసింది. వీళ్ల కుమ్ములాటలో ఓ వ్యక్తి గాయపడి ఆస్పత్రిలో చనిపోయారు.
- సీఎం చంద్రబాబు
బాపట్ల, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ నియామకాలను సైతం గొడ్డలి పా ర్టీ రాజకీయం చేస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘‘ఒక తరం భవిష్యత్తును నాశనం చేసిన పార్టీ అది. జెన్ జీ కాదు గొడ్డలి-జె. గొడ్డలి అరాచకాలను ఉపేక్షించేది లేదు. నేరగాళ్లను ఆ పార్టీ ప్రోత్సహిస్తోంది’’ అని ఆగ్రహించారు. ‘‘మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ‘పరామర్శ’ మొదలుకుని పొగాకు రైతుల వద్ద వెళ్లడం దాకా ప్రతి చోటా విధ్వంసం, అరాచకమే. యాక్సిడెంట్ చేసి గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. కా నీ, ఆధారాలు తారుమారు చేసేందుకు మాజీ మం త్రి అప్పలరాజు ప్రయత్నించారు. వ్యక్తులను మార్చే సే కుట్రలు చేసి కేసును మాఫీ చేయాలని చూశా రు. కానీ రాష్ట్రమంతా సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉండడంతో మూడో నేత్రం నుంచి తప్పించుకోలేకపోయారు.
అప్పల రాజు పరామర్శ పేరిట జగన్ రోడ్లపై విధ్వంసం సృష్టించారు. పైగా 44ఏళ్ల వ్యక్తి చనిపోతే ఇబ్బందేమిటనే విధంగా మాట్లాడారు. ఇదెక్కడి విడ్డూరం? శాంతి భద్రతలను కాపాడే ఓ మహిళా పోలీసు అధికారి విషయంలో అసభ్యంగా ప్రవర్తించారు. సభ్యతగా వ్యవహరించాల్సిన రాజకీ య పార్టీలు అసభ్యంగా బాధ్యతా రాహిత్యంతో ప్రవర్తిస్తున్నాయి.’’ అని చంద్రబాబు మండిపడ్డారు. రాజకీయం ముసుగులో రప్పా రప్పా అంటూ రోడ్ల మీద వీరంగం వేస్తున్నారని ఆగ్రహించారు. ‘‘గొడ్డలి పార్టీ అధినేత బయటకు వస్తే అరాచకమే. ఎవరో ఒకరు చనిపోవాల్సిందే. జగన్ పర్యటనలో తోసుకుంటూ వెళ్లడం తో గాయపడిన ఒకతను ఈ రోజు చనిపోయాడు. మేం ఇంటింటికీ తెలుగుదేశం అంటుంటే, వాళ్లు రప్పా రప్పా అంటున్నారు. సీబీఎన్ అంటేనే లా అండ్ ఆర్డర్. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తుల పట్ల కఠినంగా ఉంటాం’’ అని సీఎం హెచ్చరించారు. రాజధానికి అనుకూలమని చెప్పి అధికారం రాగానే 3 ముక్కలాటకు గత ప్రభుత్వం తెర తీసిందని, మళ్లీ ఇప్పుడు వాటికన్ సిటీ తరహాలో మావిగన్ అంటున్నారని మండిపడ్డారు. ‘‘నాలుకకు ఇన్ని మడతలుంటాయని నాకు తెలీదు.’’ అన్నారు.