‘స్థానికం’లో సీట్లపై చర్చ అప్రస్తుతం
ABN , Publish Date - Jul 19 , 2026 | 03:05 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని సీఎం చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలను ఆదేశించారు. శనివారం వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు.
పార్టీ ముఖ్య నేతలతో సమావేశంలోబాబు
అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని సీఎం చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలను ఆదేశించారు. శనివారం వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించా రు. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని సీఎం సూచించా రు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థా నాల్లో పోటీ చేస్తుందనే అంశంపై కూటమి పార్టీ ల అగ్ర నాయకత్వాలు చర్చించి నిర్ణయానికి వ స్తాయి. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే దానిపై ఇప్పటి నుంచే చర్చలు అప్రస్తుతం. ఈ విషయాన్ని 3పార్టీల అధిష్ఠానాలు చూసుకుంటాయి. కూటమి పార్టీల నడుమ విభేదాలు సృష్టించేందుకు గొడ్డలి పార్టీ కాచుకుని కూర్చుందనే విషయాన్ని గమనించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం గెలుపు సాధించే విధంగా పనిచేయాలి.’ అని చంద్రబాబు చెప్పారు.