Shivalinga Vandalism Incident: శివలింగం ధ్వంసంపై సీఎం ఆరా
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:16 AM
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గుర్తు తెలియని వ్యక్తులు శివలింగాన్ని ధ్వంసం చేయడంపై సీఎం చంద్రబాబు స్పందించారు.
అమరావతి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గుర్తు తెలియని వ్యక్తులు శివలింగాన్ని ధ్వంసం చేయడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం విషయం తెలిసిన వెంటనే దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ధ్వంసమైన శివలింగం స్థానంలో నూతన శివలింగాన్ని ప్రతిష్ఠించాలని, శివలింగం ధ్వంసం ఘటనకు కారకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారు.