మన మిత్ర సేవలు భేష్ ప్రజలకు మరింత చేరువ కావాలి: సీఎం
ABN , Publish Date - Jul 15 , 2026 | 04:15 AM
‘మన మిత్ర’ వాట్సాప్ ద్వారా పౌరులకు అందిస్తున్న బాగున్నాయని, అయితే.. మరింత మందికి ఈ సేవలు చేరువ కావాలని సీఎం చంద్రబాబు సూచించారు.
అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): ‘మన మిత్ర’ వాట్సాప్ ద్వారా పౌరులకు అందిస్తున్న బాగున్నాయని, అయితే.. మరింత మందికి ఈ సేవలు చేరువ కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. మంగళవారం సచివాలయంలో సమీక్ష సందర్భంగా రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) నెలవారీ సేవలను ఆయన ఆవిష్కరించారు. ఈ మాధ్యమం ద్వారా 32 శాఖలకు సంబంధించిన 1100కు పైగా పౌర సేవలను ఆర్టీజీఎస్ అందిస్తోంది. గత నెల రోజుల్లో 60 లక్షల మందికి మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా సేవలందించారు. శాంతిభధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించడంలో ఆర్టీజీఎస్ కీలకపాత్ర పోషిస్తోంది. రోడ్డ ప్రమాదాల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తోంది. వాహనాలతో ఢీకొట్టి పారిపోయినవారి సమాచారాన్ని అందిస్తోంది. డ్రోన్ల ద్వారా నేరాలను అరికట్టడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తోంది. తీరప్రాంతంలోనూ ఆర్టీజీఎస్ ద్వారా గస్తీ కొనసాగుతోంది. వాతావరణ మార్పుల సమయంలో విస్తరించే వ్యాధుల సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖకు వివరిస్తోంది. విద్యార్ధులకు పరీక్షా ఫలితాలు, కులధ్రువీకరణ పత్రాలు, మార్కు ల జాబితాలు మన మిత్ర ద్వారా అందిస్తున్నారు. ఏఐ ద్వారా ప్రజల వినతులను పరిష్కరిస్తోంది.