Share News

జలధారకు మండల నోడల్‌ అధికారులే కీలకం

ABN , Publish Date - Apr 20 , 2026 | 04:44 AM

జలధార అమలుకు సంబంధించి మండల నోడల్‌ అధికారులు కీలకంగా వ్యవహరించాలని, అర్బన్‌ మండలాల్లో కూడా నోడల్‌ అధికారులు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

జలధారకు మండల నోడల్‌ అధికారులే కీలకం

  • అన్నమయ్య జిల్లా మోడల్‌.. రాష్ట్రవ్యాప్తంగా అమలు కావాలి: సీఎం

అమరావతి, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): జలధార అమలుకు సంబంధించి మండల నోడల్‌ అధికారులు కీలకంగా వ్యవహరించాలని, అర్బన్‌ మండలాల్లో కూడా నోడల్‌ అధికారులు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. జలధార-జలహారతి కార్యక్రమంపై ఆదివారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నీటి సంరక్షణ-నీటి భద్రత విషయంలో అన్నమయ్య జిల్లా మోడల్‌.. రాష్ట్రవ్యాప్తంగా అమలు కావాలన్నారు. భారీ వర్షాలు పడినా ముంపు లేకుండా కాలువలు, చెరువులను మరమ్మతులు చేయాలన్నారు. వర్షాకాలంలో చెరువులన్నీ నింపాలని చెప్పారు. రాష్ట్రంలో వివిధ దేవాలయాల్లో ఉన్న పుష్కరిణులలో నీటిని నింపేలా కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవాలన్నారు.

Updated Date - Apr 20 , 2026 | 04:45 AM