తమ్ముడిని స్మరించుకున్న చంద్రబాబు
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:10 AM
మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి జయంతి సందర్భంగా ఆయన్ను సీఎం చంద్రబాబు స్మరించుకున్నారు.
అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడి జయంతి సందర్భంగా ఆయన్ను సీఎం చంద్రబాబు స్మరించుకున్నారు. ‘తోడబుట్టిన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. భౌతికంగా మాకు దూరమైనా.. మా మనసుల్లో మరిచిపోలేని జ్ఞాపకంగా ఎప్పటికీ ఉంటాడు’ అని సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ కూడా బాబాయి రామ్మూర్తి నాయుడికి నివాళులర్పించారు.