Share News

అమరావతిపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

ABN , Publish Date - Apr 01 , 2026 | 05:45 AM

అమరావతిని నవ్యాంధ్ర రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం బుధవారం చట్టం చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిని సగర్వంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నేతలను కోరారు.

అమరావతిపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి

  • రాజధానికి చట్టబద్ధతను సగర్వంగా ప్రజల్లోకి తీసుకెళ్లండి: సీఎం

  • గత పాలకులు 3 ముక్కలాట ఆడారు.. రాజధానే లేకుండా చేశారు

  • సీమకు మనం చేస్తున్న మంచితో ఆటలు సాగవనే వైసీపీ విషం

  • నీచులు, నేరచరితులతో అప్రమత్తంగా ఉండాలి

  • టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

  • గత పాలకులు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. దీంతో పెట్టుబడులు పెట్టేవారు కూడా వెనుకంజ వేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి కొంత మారింది. ఇప్పుడు రాజధాని అమరావతికి చట్టబద్ధతతో పూర్తిగా మారుతుంది.

  • రాయలసీమకు మన ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలతో వైసీపీ ఆటలు సాగవనే.. వారు మన ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నీతిమాలిన చర్యలకు పాల్పడుతున్నారు. నీచులు, నేరచరితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

- సీఎం చంద్రబాబు

అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): అమరావతిని నవ్యాంధ్ర రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం బుధవారం చట్టం చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనిని సగర్వంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ నేతలను కోరారు. మంగళవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలతో టెలికాన్ఫరెన్సు ని ర్వహించారు. రైతులు ఇచ్చిన భూములతో రాజధాని ని నిర్మిస్తున్నామని.. 2019లో మనం గెలిచి ఉంటే అమరావతిని దేశంలోనే ఆదర్శ నగరంగా నిర్మించేవారిమని తెలిపారు. రాజధానిపై వైసీపీ చేస్తున్న అనవసర విమర్శలను, దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని పార్టీ నేతలను ఆదేశించారు. వైసీపీ నాయకుల కు రాష్ట్రాభివృద్ధిపై స్పష్టత లేదన్నారు. దేశంలోకెల్లా రాయలసీమ నుంచే ఎక్కువ ఉద్యాన ఉత్పత్తులు పండుతున్నాయని.. పూర్వోదయ పథకం ద్వారా సీమ దశ మారుతోందన్నారు. తుంగభద్ర గేట్ల మరమ్మతులు చేస్తున్నామని, శ్రీశైలం డ్యాం ప్లంజ్‌పూల్‌ పూడ్చే పనులు చేపట్టామని తెలిపారు. రాష్ట్రాన్ని గ్రీ న్‌ హైడ్రోజన్‌ హబ్‌గా మార్చేందుకు అనేక ప్రాజెక్టు లు తీసుకొచ్చామని.. త్వరలోనే కడప స్టీల్‌ ప్లాంట్‌ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతలపై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, తప్పుడు ప్రచారాన్ని ఖండించాలని స్పష్టం చేశారు. ఇంకా ఏం చెప్పారంటే..


ఏడాదిలో 2 లక్షల కుటుంబాల్లో మార్పు

ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తు న్నాం. బుధవారం నుంచి మగ్గాలున్న చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాలున్నవారికి 500 యూని ట్లు వరకు ఉచిత విద్యుత్‌ అమలుకు శ్రీకారం చుడుతున్నాం. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల గృహప్రవేశాలు చేసి పేదల ఆశలను నెరవేర్చాం. 20 నెలల్లో 5.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందించాం. 80 వేల మంది టిడ్కో ఇళ్ల కోసం అడ్వాన్స్‌గా డబ్బులు చెల్లించారు. కానీ గత ప్రభు త్వం నిర్మించకుండా విస్మరించింది. ఆ అడ్వాన్స్‌ సొ మ్ము రూ.174 కోట్లనూ తిరిగి చెల్లిస్తున్నాం. పీ-4 కింద 10 లక్షల కుటుంబాలను లక్ష మంది మార్గదర్శులు దత్తత తీసుకున్నారు. ఏడాదిలో 2 లక్షల కు టుంబాల్లో మార్పులు తీసుకురాగలిగాం. ఉద్యోగుల కు క్రమం తప్పకుండా నెల మొదటి రోజునే జీతాలు ఇస్తున్నాం. బకాయిలు కూడా చెల్లిస్తున్నాం. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను నష్టాల నుంచి గట్టెక్కిస్తున్నాం. నక్కపల్లిలో అర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశాం. 12 లక్షల మంది దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రమాణ సౌకర్యం కల్పిస్తున్నాం. కార్యకర్తల పట్ల ప్రజాప్రతినిధులు సత్ప్రవర్తనతో మెలగాలి. వారిని ఆప్యాయం గా దగ్గరకు తీసుకోవాలి. క్లస్టర్‌ స్థాయి వరకూ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. త్వరలో జోనల్‌ స్థాయిలోనూ జరుపుతాం.

Updated Date - Apr 01 , 2026 | 05:46 AM