మహానాడులో బాగా మాట్లాడారు
ABN , Publish Date - May 30 , 2026 | 06:03 AM
మహానాడులో 88 మంది ప్రసంగిస్తే ప్రతి ఒక్కరూ అద్భుతంగా మాట్లాడారని, అదే ఊపుతో ప్రభుత్వ విజయాలను, విపక్ష వైసీపీ దుష్ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు చెప్పారు.
మంత్రులతో సమావేశంలో సీఎం చంద్రబాబు
మహానాడులో 88 మంది ప్రసంగిస్తే ప్రతి ఒక్కరూ అద్భుతంగా మాట్లాడారని, అదే ఊపుతో ప్రభుత్వ విజయాలను, విపక్ష వైసీపీ దుష్ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు చెప్పారు. సచివాలయంలో శుక్రవారం మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, బీసీ జనార్ధన్‌రెడ్డి, పయ్యావుల కేశవ్, కె.పార్థసారఽథి అనగాని సత్యప్రసాద్‌తో సీఎం సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, మహానాడు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్, వైసీపీ రాజకీయాలపై చర్చించారు. మహానాడులో మాట్లాడిన ప్రతి ఒక్కరూ చెప్పాల్సిన విషయాన్ని, నిర్దేశిత సమయంలో బాగా చెప్పారని సీఎం ప్రశంసించారు. డీఎస్సీపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని కూడా అదే స్థాయిలో తిప్పికొట్టాలని చెప్పార