దొమ్మేటి వెంకటరెడ్డికి సీఎం నివాళి
ABN , Publish Date - Mar 24 , 2026 | 04:12 AM
సామాజిక విప్లవ నాయకుడు, శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు..
అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): సామాజిక విప్లవ నాయకుడు, శెట్టిబలిజ సంక్షేమ సంఘ స్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. బలహీనవర్గాల ఆత్మగౌరవ జ్యోతి వెంకటరెడ్డి అని కొనియాడారు. ఆయన చేసిన సామాజిక సేవలకు గుర్తుగా వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు.