అక్రమ కట్టడాలను కూల్చేయండి కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 09 , 2026 | 05:04 AM
అక్రమ నిర్మాణాలను అరికట్టాలని స్థానిక సంస్థలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సు రెండో రోజున శుక్రవారం కలెక్టర్ల పనితీరుపై సమీక్షించారు.
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): అక్రమ నిర్మాణాలను అరికట్టాలని స్థానిక సంస్థలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సు రెండో రోజున శుక్రవారం కలెక్టర్ల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా అక్రమ కట్టడాలపై మాట్లాడుతూ, ‘స్థానిక సంస్థల్లో అక్రమ కట్టడాలపై పర్యవేక్షణను వేగవంతం చేయండి. అనుమతులులే ని నిర్మాణాలపై ఉదాశీనత వద్దు. అక్రమ కట్టడాలను కూ ల్చేయండి’ అంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తుఫానులు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేరవేయాలని ఆర్‌టీజీఎ్‌సను ఆదేశించారు.