సంక్షేమం, అభివృద్ధిపై రాజీలేని పాలన
ABN , Publish Date - Apr 20 , 2026 | 04:43 AM
‘రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ.. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించే విషయంలో రాజీ పడకుండా పరిపాలన సాగిస్తున్నాం.
అయినా వైసీపీ తప్పుడు ప్రచారం: చంద్రబాబు
ఇంటర్నెట్ డెస్క్: ‘రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ.. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించే విషయంలో రాజీ పడకుండా పరిపాలన సాగిస్తున్నాం. మనం ఎంత పారదర్శకంగా వ్యవహరిస్తున్నా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని.. దీనిని తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ ముఖ్య నేతలతో అన్నారు. ఆదివారం వారితో ఆయన టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. కొందరు ప్రభుత్వం మీద, కూటమి పార్టీలపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తే నిజాలు ఏమిటనేది వాళ్లే విశ్లేషించుకుంటారని చెప్పారు. ప్రభుత్వం పడుతున్న కష్టాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పగలిగితే ప్రత్యర్థులను తిప్పికొట్టే విషయంలో వారే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు అవుతారని అన్నారు. ‘ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం అనేది మనందరి ప్రధాన బాధ్యత’ అని పునరుద్ఘాటించారు. శిక్షణ తరగతులు, కాఫీ కబుర్లు ద్వారా లీడర్, క్యాడర్ మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడుతుందన్నారు. కార్యకర్తల కోసం ‘ఎథిక్ ఎకనమిక్ ఎంపవర్‌మెంట్’ విధానాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. పార్టీ కొత్త కార్యవర్గం 29న బాధ్యతలు స్వీకరణకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. మహానాడు కమిటీల నియామకానికీ కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.