Share News

మహానీయుడు జగ్జీవన్‌ రామ్‌: చంద్రబాబు

ABN , Publish Date - Apr 06 , 2026 | 05:17 AM

దేశంలో వ్యవసాయాన్ని ఆధునికీకరించటంతోపాటు ఆహార సంక్షోభ సమయంలో దేశాన్ని గట్టెక్కించిన మహానీయుడు మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ అని సీఎం చంద్రబాబు కొనియాడారు.

మహానీయుడు జగ్జీవన్‌ రామ్‌: చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): దేశంలో వ్యవసాయాన్ని ఆధునికీకరించటంతోపాటు ఆహార సంక్షోభ సమయంలో దేశాన్ని గట్టెక్కించిన మహానీయుడు మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌ రామ్‌ అని సీఎం చంద్రబాబు కొనియాడారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం బాబూ జగ్జీవన్‌ రామ్‌ 119వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, నేతలు ఉండవల్లి శ్రీదేవి, పిల్లి మాణిక్యాలరావు, బాలకోటయ్య తదితరులతో కలిసి బాబూ జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి సీఎం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన స్ఫూర్తితోనే ప్రభుత్వం నడుస్తోందని, ఎస్సీల్లోని అన్ని కులాలకూ సమాన అవకాశాలు దక్కాలనే వర్గీకరణ చేశామని తెలిపారు. బాబూ జగ్జీవన్‌ రామ్‌ విగ్రహాన్ని దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి ఆయనకు నివాళి అర్పించామని తెలిపారు.

Updated Date - Apr 06 , 2026 | 05:18 AM