Davos Visit: దావోస్‌కు సీఎం చంద్రబాబు బృందం
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:04 AM
ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరి వెళ్లారు.
అమరావతి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరి వెళ్లారు. ఆదివారం రాత్రి 8.30కు విజయవాడ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్లిన చంద్రబాబు అక్కడినుంచి సోమవారం జ్యూరిక్‌కు చేరుకుంటారు. ఆయనతోపాటు మంత్రులు లోకేశ్, టీజీ భరత్, పలువురు అధికారులు కూడా బయల్దేరి వెళ్లారు. సోమవారం జ్యూరిక్‌లో జరిగే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎంతోపాటు లోకేశ్ తదితరులు పాల్గొంటారు. అనంతరం జ్యూరిక్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్‌కు వెళ్తారు.