Share News

మహిళ వినతిపై సీఎం స్పందన

ABN , Publish Date - Jul 11 , 2026 | 04:38 AM

తన కుమార్తెల విద్యాభ్యాసానికి ఆర్థికసాయం అందించాలని కోరిన మహిళ వినతిపై సీఎం తక్షణం స్పందించారు.

మహిళ వినతిపై సీఎం స్పందన

  • కుమార్తెల చదువుకు రూ.2 లక్షల సాయం

అమరావతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): తన కుమార్తెల విద్యాభ్యాసానికి ఆర్థికసాయం అందించాలని కోరిన మహిళ వినతిపై సీఎం తక్షణం స్పందించారు. గురువారం బనగానపల్లె పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబుకు బేతంచర్ల మండలం గూటుపల్లెకి చెందిన కాదారమ్మ లక్ష్మి తన కుమార్తెల చదువు కోసం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన సీఎం కలెక్టర్‌ను సాయం చేయాలని ఆదేశించగా.. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ రాజకుమారి లక్ష్మికి రూ.2లక్షల ఆర్థికసాయం అందజేశారు.

Updated Date - Jul 11 , 2026 | 04:39 AM