నెరవేరిన చంద్రబాబు హామీ
ABN , Publish Date - May 16 , 2026 | 04:30 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు హామీని అధికారులు నెరవేర్చారు. కిడ్నీ బాధితుడికి నాలుగు నెలల్లో ట్రిపుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించి శుక్రవారం అందజేశారు.
కిడ్నీ బాధిత కుటుంబానికి 4 నెలల్లో ట్రిపుల్ బెడ్‌రూం ఇల్లు
దత్తిరాజేరు, మే 15(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు హామీని అధికారులు నెరవేర్చారు. కిడ్నీ బాధితుడికి నాలుగు నెలల్లో ట్రిపుల్ బెడ్ రూం ఇల్లు నిర్మించి శుక్రవారం అందజేశారు. గతేడాది అక్టోబరు 1న సామాజిక పింఛన్ల పంపిణీ నిమిత్తం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా.. గ్రామంలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని ఇబ్బంది పడుతున్న పొట్నూరు అప్పలరాజు ఇంటికి చంద్రబాబు వెళ్లి, బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పారు. మూడు నెలల్లో అతనికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. ఇద్దరు ఆడపిల్లలకు రెండు, అతని తల్లికి మరొక గదితో మొత్తంగా ట్రిపుల్ బెడ్‌రూం ఇల్లు నిర్మించాలని చెప్పారు. అధికారులు బాధితుడికి మూడు సెంట్ల స్థలం సమకూర్చి రూ.12.50 లక్షలతో 120 రోజుల్లోనే ట్రిపుల్ బెడ్‌రూం ఇల్లు నిర్మించారు. ఈ ఇంటిని శుక్రవారంనాడు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.