ఉత్తరాంధ్ర.. ఉక్కు ఆంధ్ర!
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:26 AM
అనకాపల్లి జిల్లాలో ఏర్పాటవుతున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమ ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు నూతన దిక్సూచి అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
ఆర్సెలార్ స్టీల్ ప్లాంట్‌పై ‘ఎక్స్’లో సీఎం
అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లాలో ఏర్పాటవుతున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా పరిశ్రమ ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు నూతన దిక్సూచి అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఉక్కు కర్మాగారం ఉత్తరాంధ్రను ‘ఉక్కు ఆంధ్ర’గా మారుస్తుందంటూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. ‘మాట ఇచ్చాం.. మార్పు తెచ్చాం. ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రతి రంగంలో, ప్రతి ప్రాంతంలో మార్పు తెచ్చి చూపిస్తున్నాం.’ అని పేర్కొన్నారు.