భారతీరాజా మృతి బాధాకరం!
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:48 AM
ప్రఖ్యాత సినీ దర్శకుడు భారతీరాజా మరణం బాధాకరమని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
సినీ రంగానికి తీరని లోటు: సీఎం, డిప్యూటీ సీఎం
అమరావతి, జూన్ 10(ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత సినీ దర్శకుడు భారతీరాజా మరణం బాధాకరమని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భారతీయ సినీ రంగానికి ఆయన మరణం తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు ఆయన చిరస్మరణీయ చిత్రాలు అందించారని చంద్రబాబు తెలిపారు. భారతీరాజా కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.