అందరినీ ఆకట్టుకున్న సమష్టి నినాదం
ABN , Publish Date - Aug 21 , 2026 | 05:11 AM
జోనల్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు చేసిన ప్రసంగం.. తోటి సీఎంలను ఆకట్టుకుంది. సమస్యలు, ఫిర్యాదుల జాబితాగా కాకుండా ఆయన వాటికి పరిష్కారాలు సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: జోనల్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు చేసిన ప్రసంగం.. తోటి సీఎంలను ఆకట్టుకుంది. సమస్యలు, ఫిర్యాదుల జాబితాగా కాకుండా ఆయన వాటికి పరిష్కారాలు సూచించారు. వివాదాలు అభివృద్ధికి తోడ్పడవని, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో కూడిన సహకార సమాఖ్య విధానమే అభివృద్ధికి మార్గమని హితవుచెప్పారు. ఆయన తీరును సీఎంలు ప్రశంసించారు. ఎంతో విజన్‌తో మాట్లాడారని వారు పేర్కొన్నారు. ‘సీనియర్ నాయకుడిగా, ఓ పెద్దన్నలా చంద్రబాబు అన్ని రాష్ట్రాల అభివృద్ధి గురించీ మాట్లాడారు. ఆయన విశాల దృక్పథం కలిగిన అద్భుతమైన వ్యక్తి’ అని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కొనియాడారు.