Share News

2029 ఎన్నికల్లో విజయం ఖాయం

ABN , Publish Date - Aug 23 , 2026 | 04:51 AM

కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేస్తే 2029 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

2029 ఎన్నికల్లో విజయం ఖాయం

  • కార్యకర్తల భేటీలో చంద్రబాబు ధీమా

కె.కోటపాడు, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేస్తే 2029 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన శనివారం అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం అలమండ కోడూరు గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకునేలా ప్రతి కార్యకర్తా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Updated Date - Aug 23 , 2026 | 04:53 AM