అన్నివిధాలా ఆదుకుంటాం
ABN , Publish Date - Jul 01 , 2026 | 06:47 AM
రోడ్డు ప్రమాదంలో గాయపడి ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్త బాసాని నాగేశ్వరరావును ఆ పార్టీ అధినేత చంద్రబాబు మంగళవారం ఫోన్‌లో పరామర్శించారు.
టీడీపీ కార్యకర్తకు సీఎం చంద్రబాబు భరోసా
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగేశ్వరరావుతో ఫోన్‌లో మాట్లాడిన అధినేత
ఖమ్మం అర్బన్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో గాయపడి ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్త బాసాని నాగేశ్వరరావును ఆ పార్టీ అధినేత చంద్రబాబు మంగళవారం ఫోన్‌లో పరామర్శించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు 40ఏళ్లుగా టీడీపీ కార్యకర్తగా ఉన్నారు. రెండురోజుల క్రితం ద్విచక్రవాహనంపై వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావును ఖమ్మలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. విషయం తెలుసుకున్న మంత్రి లోకేశ్.. నాగేశ్వరరావును పరామర్శించాలని తెలుగు యువత మాజీ అధ్యక్షుడు, తెలంగాణ టీడీపీ నాయకుడు డాక్టర్ పొగాకు జయరాం చందర్‌కు సూచించారు. దీంతో మంగళవారం ఖమ్మం చేరుకున్న జయరాంచందర్ నాగేశ్వరరావును పరామర్శించి చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడించారు. పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయనకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని, ఇతరత్రా సహాయం కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు.