Share News

సంకల్పాలున్నాయి.. సాధ్యం చేసి చూపిస్తా: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 08 , 2026 | 04:41 AM

ఆర్థిక కష్టాలున్నా సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రం హితం కోరే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

సంకల్పాలున్నాయి.. సాధ్యం చేసి చూపిస్తా: సీఎం చంద్రబాబు

  • ఏటా 25 వేలు.. ఇప్పటికే ఉచిత విద్యుత్‌, పింఛన్‌

  • ఇంకా చేయాలని ఉందిగానీ, ఖజానా ఖాళీ

  • చేనేత నైపుణ్యాలకు మెరుగులు దిద్దుతాం

  • కారిడార్‌,ఎయిర్‌పోర్ట్‌ వస్తే చీరాలకు మహర్దశే

  • అడ్డంకులెన్ని వచ్చినా రాష్ట్ర హితంపై రాజీ లేదు

  • ‘నేతన్న సేవలో’ పథకానికి సీఎం శ్రీకారం

  • 71,536 కుటుంబాల ఖాతాల్లో 179 కోట్లు జమ

బాపట్ల, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక కష్టాలున్నా సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రం హితం కోరే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రెండేళ్లలో రూ. 1,50,000 కోట్ల సంక్షేమం అందించామన్నారు. ఇంకా చేయాలని ఉందిగానీ ఖజానా ఖాళీగా ఉందని వ్యాఖ్యానించారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ పరిధిలోని కొత్తపేటలో శుక్రవారం జరిగిన 12వ జాతీయ చేనేత దినోత్సవంలో చంద్రబాబు పాల్గొన్నారు. నేతన్నల సేవలో... పథకానికి ఆ వేదికపై నుంచి శ్రీకారం చుట్టారు. రూ.25 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 71,536 నేతన్నల కుటుంబాలకు రూ.179 కోట్లను సీఎం విడుదల చేశారు. అనంతరం ప్రజా వేదిక సభలో మాట్లాడారు. 1.27 లక్షల కుటుంబాలు చేనేతపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయన్నారు. ‘‘చీరాల పేరు వింటేనే నేతన్నల నైపుణ్యం గుర్తుకు వస్తుంది. చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, పెడ న, శ్రీకాళహస్తి ఉత్పత్తులు విశిష్ఠ గుర్తిం పు పొందాయి’’ అని సీఎం అన్నారు. చేనేత కార్మికుల కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ కూడా ఇస్తున్నామన్నారు. దీని ద్వారా 62,541 చేనేత కుటుంబాలకు, 10,032 పవర్‌లూమ్‌ కుటుంబాలకు మేలు జరుగుతోందన్నారు. 85 వేల మంది చేనేతల కు నెలకు రూ.4,000 చొప్పున పింఛన్‌ అందిస్తున్నాం. స్మాల్‌ క్లస్టర్‌ డెవల్‌పమెంట్‌ ప్రో గ్రాం కింద రూ.10 కోట్ల వ్యయంతో 10 చేనే త క్లస్టర్లకు ఆమోదం తెలిపాం..’’ అని చంద్రబాబు తెలిపారు. ఆయన ఏమన్నారంటే..


బీసీలే అండ..

‘‘టీడీపీకి బీసీలే అండ. ఈ వర్గాల సంక్షే మం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. వారి కి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తెస్తు న్నాం. చేపల వేట నిషేధ సమయంలో 1.34 లక్షల మత్స్యకార కుటుంబాలకు రూ.20 వే లు చొప్పున రెండేళ్లలో రూ.505 కోట్లు ఇ చ్చాం. వడ్డెరలకు మైనింగ్‌ లీజులు, గీత కార్మికులకు ఎక్సైజ్‌ షాపులు కేటాయించాం. రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చాయి. వీటి వల్ల 12 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి దొరకనుంది. సూర్యలంకతోపాటు ‘బాపట్ల-చీరాల మధ్య మంచి బీచ్‌లు ఉన్నాయి. శనివారం వస్తే హైదరాబాద్‌ అంతా ఇక్కడ బీచ్‌ల వద్దే ఉంటోంది. మరో గోవా ఇక్కడే ఉంది. తీరం అందాలు చూడడానికి ప్రపంచమంతా ఇక్కడకు వస్తుంది. సంకల్పాలు చాలా ఉన్నాయి. ఇది సాధ్యమేనా? అని కొంతమంది అడుగుతారు. కచ్చితంగా సాధ్యమే. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా. ఉచిత సిలిండర్‌ డబ్బులను రీయింబర్స్‌ చేయడం కాకుండా ఒకేసారి లబ్ధ్దిదారుల ఖాతాల్లో వేసే ఆలోచన చేస్తున్నాం. దీనివల్ల లబ్ధిదారులకే మేలు జరుగుతుంది సంజీవనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం.’’ అన్నారు.


పని చేస్తే దండ.. లేదంటే దండనే

చీరాలలోని ప్రజావేదిక సభ నుంచి వివిధ విభాగాల పనితీరుపై పీపీపీ(పబ్లిక్‌ పాజిటివ్‌ పర్‌సెప్షన్‌) సర్వే వివరాలను సీఎం చంద్రబాబు వెల్లడించారు. బాపట్ల జిల్లా మైనింగ్‌ శాఖ పనితీరు 11.12 శాతం మైన్‌సలో ఉంది. దీనిపై సదరు అధికారిని సీఎం వివరణ అడిగారు. ‘ఏమన్నా సిండికేట్‌ నడుస్తుందా.. దొంగ వ్యాపారం జరుగుతోందా.. రూ.వేల కోట్ల ప్రభుత్వ ఆదాయం వదులుకుని ఉచిత ఇసుకను అందిస్తున్నాం. ప్రజల్లో ఇంత నెగిటివ్‌ ఉంటే ఎలా?’ అని సీఎం ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్‌ ఎందుకు చర్య తీసుకోవడం లేదో జవాబు చెప్పాలన్నా రు. మళ్లీ నెలలో సమీక్షిస్తానని, ఇదే పరిస్థితి ఉంటే తానే నేరు గా ఇసుక రీచ్‌ వద్దకు వెళ్లి చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ సందేశం రాష్ట్రమంతా వెళ్లాలన్నారు. పీపీపీ సర్వేలో బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల పనితీరు బాగోలేదని తేలింది. దీనిపై సదరు మహిళా అధికారిని సీఎం ప్రశ్నించారు. ఇదే స మయంలో సంబంధిత శాఖ మంత్రి సవిత వేదికపై ఉండడం తో... ఈ రోజే ఆ స్కూళ్లకు వెళ్లి పరిశీలించాలని మంత్రిని ఆదేశించారు. విద్యుత్‌ శాఖపై రిపోర్టు మైన్‌సలో ఉండడంతో అదే వేదికపై ఉన్న మంత్రి గొట్టిపాటితో కూడా సీఎం సరదాగా వ్యాఖ్యానిస్తూ.. మంచిగా పనిచేస్తే దండ వేస్తానని...లేకుంటే దండన తప్పదని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆయా విభాగాల పనితీరుపై రిపోర్టు ఇచ్చిన సీఎం.. పనితీరు బాగోలేని శాఖల అధికారులతో ప్రజలకే వివరణ ఇప్పించారు. అధికారులయినా, తానయినా జనాన్ని మెప్పించాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated Date - Aug 08 , 2026 | 05:54 AM