‘జలధార’ కింద జిల్లాకు 2 కోట్లు
ABN , Publish Date - Jul 14 , 2026 | 04:26 AM
‘జలధార’ పథకం కింద చెరువుల పూడికతీత పనుల కోసం సీఎం చంద్రబాబు జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు ప్రకటించారు.
పోలవరం నిర్వాసితుల కోసం నెలకు 300 కోట్లు: సీఎం
అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): ‘జలధార’ పథకం కింద చెరువుల పూడికతీత పనుల కోసం సీఎం చంద్రబాబు జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున నిధులు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు పర్యటనలో సోమవారం ఆయన నిర్వహించిన సమీక్షలో జలధార పథకం ప్రత్యేక అధికారి ప్రశాంతి ప్రతిపాదనపై ఆయన సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం నెలకు రూ.300 కోట్లు వ్యయం చేసేందుకు ఆమోదించారు.