Share News

’కుట్ర చేయడానికే అమరావతికి

ABN , Publish Date - Jun 28 , 2026 | 05:26 AM

అమరావతిపై కుట్ర చేయడానికే గొడ్డలి పార్టీ ఆ ప్రాంతానికి వెళ్లిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘‘అధికారంలో ఉన్న ఐదేళ్లూ నాటకాలాడి ప్రస్తుతం రాజధాని నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో..

’కుట్ర చేయడానికే అమరావతికి

  • వైసీపీ కార్యక్రమంపై సీఎం మండిపాటు

(ఒంగోలు ఆంధ్రజ్యోతి)

అమరావతిపై కుట్ర చేయడానికే గొడ్డలి పార్టీ ఆ ప్రాంతానికి వెళ్లిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘‘అధికారంలో ఉన్న ఐదేళ్లూ నాటకాలాడి ప్రస్తుతం రాజధాని నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో, ఆ ప్రాంతానికి వెళ్లడంలోని ఆంతర్యం ఏంటి’’ అని ఆయన ఆగ్రహించారు. శనివారం ఆయన మార్కాపురం జిల్లాలో రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత వెలిగొండ ప్రాజెక్ట్‌ నిర్మాణం ప్రాంతాన్ని పరిశీలించారు. కాంట్రాక్టర్లను పిలిపించి పనులు ఎప్పటివరకు పూర్తవుతాయనని ప్రశ్నించారు. వచ్చేనెల 30కు పూర్తి చేస్తామని చెప్పగా, ఇప్పటికే కొంత జాప్యమైందని, నిర్మాణాల్లో లోపాలు కనిపించినా, సకాలంలో పనులు పూర్తిచేయకపోయినా మీ సంస్థను బ్లాక్‌లిస్టుల్లో పెడతానని హెచ్చరించారు. ఆ తర్వాత వెలిగొండ నిర్వాసితులతో సమావేశమయ్యారు. శని, ఆదివారం సెలవులు కావటంతో సోమవారం సాయంత్రానికి అందరి ఖాతాల్లో నగదు జమవుతుందన్నారు. నిర్వాసితులు కొన్ని సమస్యలు ప్రస్తావించగా...అన్నివిధాలుగా అండగా ఉంటానన్నారు. ఆ తర్వాత గిద్దలూరు కృష్ణంశెట్టిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని, సంజీవని డిజిటల్‌ సర్వ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన వైసీపీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందని ఆగ్రహించారు. అధికారంలో ఉన్నప్పుడు దేవాలయాలపై దాడులు చేయించి, ఇప్పుడు ఓట్ల రాజకీయం కోసం వైసీపీ నేత జగన్‌ దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారని చంద్రబాబు అన్నారు.

Updated Date - Jun 28 , 2026 | 05:27 AM