Share News

జ్యోతిరావు ఫూలేకు సీఎం నివాళి

ABN , Publish Date - Apr 12 , 2026 | 06:00 AM

మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమాన్ని శనివారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

జ్యోతిరావు ఫూలేకు సీఎం నివాళి

అమరావతి, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి కార్యక్రమాన్ని శనివారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎంతోపాటు మంత్రులు సవిత, అనగాని సత్యప్రసాద్‌ కూడా ఫూలేకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, మంత్రులు... జ్యోతిరావు చేసిన సామాజిక సేవలను స్మరించుకున్నారు. మంత్రి లోకేశ్‌ కూడా జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఫూలే మహాశయుని ఆశయ సాధన కోసం అందరం కృషి చేద్దామని లోకేశ్‌ పిలుపునిచ్చారు. కాగా, టీడీపీ కార్యాలయంలోనూ జ్యోతిరావు ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ గోనుకుంట్ల కోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, పర్చూరి కృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 06:01 AM