Share News

సీఎం క్యాంపు కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

ABN , Publish Date - Jan 27 , 2026 | 03:44 AM

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

సీఎం క్యాంపు కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

  • జాతీయ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు

  • పార్టీ కార్యాలయంలో పల్లా ఆధ్వర్యంలో వేడుకలు

అమరావతి, జనవరి 26(ఆంధ్రజ్యోతి): గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం భద్రతా సిబ్బంది, అధికారులకు స్వీట్లు పంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన 105 అడుగుల ఎత్తైన జాతీయ జెండాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఆటోమేటిక్‌ మూవింగ్‌ టెక్నాలజీతో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను రిమోట్‌ సాయంతో ఆవిష్కరించేలా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, పర్చూరి అశోక్‌బాబు, దారపనేని నరేంద్ర, వల్లూరి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 03:45 AM