Share News

గవర్నర్‌కు సీఎం పరామర్శ

ABN , Publish Date - Apr 26 , 2026 | 05:00 AM

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శనివారం లోక్‌భవన్‌కు వెళ్లిన సీఎం..

గవర్నర్‌కు సీఎం పరామర్శ

  • జస్టిస్‌ లీసా గిల్‌తో మర్యాదపూర్వక భేటీ

అమరావతి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శనివారం లోక్‌భవన్‌కు వెళ్లిన సీఎం.. గవర్నర్‌ను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గవర్నర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ లీసా గిల్‌తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Apr 26 , 2026 | 05:01 AM