భారత మహిళల క్రికెట్ జట్టుకు సీఎం అభినందనలు
ABN , Publish Date - Sep 23 , 2026 | 08:09 AM
ఆసియా క్రీడల్లో శ్రీలంకపై ఘన విజయం సాధించి భారత్‌కు స్వర్ణం అందించిన మహిళల క్రికెట్ జట్టుకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఆసియా క్రీడల్లో శ్రీలంకపై ఘన విజయం సాధించి భారత్‌కు స్వర్ణం అందించిన మహిళల క్రికెట్ జట్టుకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఈ చరిత్రాత్మక విజయంలో భాగమైన కడప జిల్లాకు చెందిన శ్రీచరణికి సీఎం ప్రత్యేక అభినందనలు తెలిపారు. మంత్రి లోకేశ్ కూడా భారత మహిళల క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపారు.