రేపటి తిరుపతి సభ ఘనంగా నిర్వహించాలి
ABN , Publish Date - Jun 08 , 2026 | 05:05 AM
కూటమి ప్రభు త్వం తలపెట్టిన మూడు విజయోత్సవ సభల్లో మొదటి సభను మంగళవారం తిరుపతిలో ఘనంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు..
అమరావతి, విశాఖ సభలనూ విజయవంతం చేయాలి
కార్యకర్తలను భాగస్వాములను చేయాలి
సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సీఎం
కూటమి నేతలతో జూమ్ కాన్ఫరెన్స్
అమరావతి, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభు త్వం తలపెట్టిన మూడు విజయోత్సవ సభల్లో మొదటి సభను మంగళవారం తిరుపతిలో ఘనంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు మూడు పార్టీల నేతలకు పిలుపిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు, మోదీ ప్రధానిగా 12 ఏళ్ల పాలన విజయాలపై రాష్ట్రవ్యాప్తంగా తిరుపతి, అమరావతి, విశాఖపట్నంల్లో బహిరంగ సభలను నిర్వహించనున్నారు. తిరుపతి సభను సుపరిపాలన థీమ్‌తో జరుపనున్నారు. దీనిపై ఆదివారం సాయంత్రం కూటమి నేతలతో సీఎం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సభల్లో పెద్దఎత్తున కూటమి కార్యకర్తలను భాగస్వాములను చేయాలన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా సభలు జరపాలని, వాటిని విజయవంతం చేయాలని కోరారు. సమావేశం లో.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు.. జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు.