ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి దోహదం
ABN , Publish Date - Feb 04 , 2026 | 05:14 AM
ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి భారత్ - అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం దోహదం చేస్తుందని, ఇది చారిత్రాత్మక ఘట్టమని సీఎం చంద్రబాబు అన్నారు.
భారత్ - అమెరికా వాణిజ్య ఒప్పందంపై సీఎం
అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి భారత్ - అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం దోహదం చేస్తుందని, ఇది చారిత్రాత్మక ఘట్టమని సీఎం చంద్రబాబు అన్నారు. ఈమేరకు మంగళవారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈ ఒప్పందం ప్రపంచంలోని రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. ఈ ఒప్పందం ఏపీతోసహా దేశ యువత, రైతులకు అపారమైన అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు.