మహిళలను అవమానిస్తే సహించం
ABN , Publish Date - Jul 19 , 2026 | 03:15 AM
గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏ మహిళనైనా అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని..
గుంటూరు ఘటన తీవ్రంగా కలచివేసింది: బాబు, లోకేశ్
అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏ మహిళనైనా అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఇలాంటి సంఘటనలకు సమాజంలో తావు లేదని స్పష్టం చేశారు. ఘటనపై వెంటనే కఠినచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం ఎక్స్ వేదికగా తెలిపారు. నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని, ఘటనకు సంబంధం ఉన్న వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. గుంటూరు ఘటన తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. తప్పులు చేసి.. రాజకీయ పరిచయాలు, పార్టీ అండదండలు తమను కాపాడాతాయని భావిస్తే పొరపాటు పడినట్లేనని పేర్కొన్నారు.