Share News

నేడు తిరుమలకు సీఎం, మంత్రి లోకేశ్‌

ABN , Publish Date - Mar 20 , 2026 | 05:12 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్‌ శుక్రవారం తిరుమల రానున్నారు.

నేడు తిరుమలకు సీఎం, మంత్రి లోకేశ్‌

తిరుపతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్‌ శుక్రవారం తిరుమల రానున్నారు. తనయుడు దేవాన్ష్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని లోకేశ్‌ కుటుంబ సభ్యులతో కలిసి సాయంత్రం హైదరాబాదు నుంచి విమానంలో బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమల చేరుకుని రాత్రికి బస చేస్తారు. కాగా సీఎం చంద్రబాబు ఉండవల్లి నుంచి శుక్రవారం హెలికాప్టర్‌లో తిరుపతి చేరుకుని తిరుమల వెళతారు. చంద్రబాబు, లోకేశ్‌ కుటుంబ సభ్యులతో కలసి శనివారం దేవాన్ష్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకుంటారు.

Updated Date - Mar 20 , 2026 | 05:15 AM