Share News

దుర్గమ్మ గుడిలో కుంభాభిషేకానికి రండి

ABN , Publish Date - Mar 04 , 2026 | 04:01 AM

ఇంద్రకీలాద్రిపై ఈ నెల 6 నుంచి 8 వరకు శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కుంభాభిషేక మహోత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవంలో పాల్గొనడానికి...

దుర్గమ్మ గుడిలో కుంభాభిషేకానికి రండి

  • సీఎం, మంత్రి లోకేశ్‌కి ఆహ్వానం

అమరావతి, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై ఈ నెల 6 నుంచి 8 వరకు శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కుంభాభిషేక మహోత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవంలో పాల్గొనడానికి రావాలంటూ సీఎం చంద్రబాబుని, దుర్గగుడి పాలక మండలి చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో శీనా నాయక్‌, దేవదాయశాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ ఆహ్వానించారు. మంగళవారం ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన వీరు.. కుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆ తర్వాత మంత్రి లోకేశ్‌నూ కలసి కుంభాభిషేకానికి ఆహ్వానించారు.

Updated Date - Mar 04 , 2026 | 04:02 AM