Share News

ముగిసిన వేలాలు

ABN , Publish Date - Mar 07 , 2026 | 11:27 PM

పట్టణంలోని వివిధ మార్కెట్‌కు సంబంధించిన బహిరంగ వేలాలను మునిసిపల్‌ కమిషనర్‌ నయీమ్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో శనివారం మునిసిపల్‌ కార్యాలయంలో నిర్వహించారు.

 ముగిసిన  వేలాలు
అధికారులతో వాదిస్తున్న వేలందారులు

ఆదోని టౌన, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని వివిధ మార్కెట్‌కు సంబంధించిన బహిరంగ వేలాలను మునిసిపల్‌ కమిషనర్‌ నయీమ్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో శనివారం మునిసిపల్‌ కార్యాలయంలో నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన వేలాలు వివిధ కారణాలతో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యాయి. సర్కారు పాట చాలా ఎక్కువగా ఉందని, పాత బస్టాండ్‌లో ఎలాంటి అంగళ్లు లేకపోయినా గెజిట్‌లో రుసుము వసూళ్ల జాబితాలో చూపించారని నాగరాజ్‌ గౌడ్‌, ముజిబ్‌ అధికారులతో వాదించారు. గొర్రెల సంత మార్కెట్‌ గురించి ఆస్వథ నారాయణ మాట్లాడుతూ మూడు సంవత్సరాల వేలం పాట మొత్తం పై ఆవరేజ్‌గా తీసుకోవాల్సిన సర్కారు పాటను అధికంగా నిర్ణయిం చడం సరికాదన్నారు. ఝాన్సీ బాయి కూరగాలయ మార్కెట్‌ను రూ. 78,06,316లకు లక్ష్మమ్మ దక్కించుకున్నారు. పశువుల సంత, మాంసం అంగళ్లను సుశీల అనే మహిళ రూ.23,60,000లకు దక్కించుకున్నారు. ఇక చివరిగా గొర్కెల సంతతో పాటు గొర్కెల మాంసం ఆంగళ్లను లక్ష్మమ్మ అనే మహిళ రూ. 10,33,000 లక చేజిక్కించుకున్నారు. అన్ని మార్కెట్‌కు వాయిదాలు లేకుండా ఒకేసారి వేలాలు ముగియడం ఇదే ప్రథమమని వేలందారులు చర్చించుకున్నారు.

Updated Date - Mar 07 , 2026 | 11:27 PM