కృష్ణానదిపై ఐకానిక్ వంతెనకు లైన్ క్లియర్
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:23 AM
కృష్ణానదిపై సోమశిల సిద్ధేశ్వరం వద్ద వంతెన కల సాకారం కానుంది. ఇక్కడ ఐకానిక్ వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది.
నాగర్‌కర్నూల్, మార్చి 6(ఆంధ్రజ్యోతి): కృష్ణానదిపై సోమశిల సిద్ధేశ్వరం వద్ద వంతెన కల సాకారం కానుంది. ఇక్కడ ఐకానిక్ వంతెన నిర్మాణానికి మార్గం సుగమమైంది. రూ.1,082 కోట్ల వ్యయంతో వంతెన మంజూరైనా పర్యావరణ అనుమతులు రాక రెండున్నర ఏళ్లుగా నిర్మాణ పనులు ముందుకు పడలేదు. ఈ క్రమంలో వారం క్రితం కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఉన్నతాధికారులు బృందం వంతెన నిర్మించనున్న ప్రదేశాన్ని సందర్శించింది. అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతంలో సామాజిక వనానికి భూమి కేటాయించడానికి జిల్లా యంత్రాంగం సుముఖత వ్యక్తం చేయడంతో కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు వచ్చాయి. దీని నిర్మాణం పూర్తయితే తిరుపతి, చెన్నైలకు ప్రయాణ దూరం తగ్గిపోనుంది.