డీఏ అరియర్లపై నెలలో ఆదేశాలు: బొప్పరాజు
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:33 AM
డీఏ అరియర్స్ బిల్లులను సమర్పించే సమస్యను పరిష్కరించే దిశగా నెల రోజుల్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు...
విజయవాడ సిటీ, మార్చి 3(ఆంధ్రజ్యోతి): డీఏ అరియర్స్ బిల్లులను సమర్పించే సమస్యను పరిష్కరించే దిశగా నెల రోజుల్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2018 జూలై నుంచి డీఏ అరియర్స్‌ను పెన్షనర్లు, సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించిన విషయం తెలిసిందే. అయితే సాంకేతిక కారణాలు, ట్రెజరీలో రిజెక్ట్ అయినందున కొందరు బిల్లులు సమర్పించలేకపోయారు. బ్యాంకుల విలీనం, ట్రెజరీ ఉద్యోగులు బదిలీ కావడం, బ్యాంకు వివరాలు అప్‌డేట్ కాకపోవడం, ఆధార్ లింక్ చేయకపోవడం తదితర కారణాలతో ప్రభుత్వం ప్రకటించిన డీఏ అరియర్స్ చాలా మందికి అందలేదు. సీఎ్‌ఫఎంఎ్‌సలో డీఏ అరియర్స్ బిల్లులను తిరిగి సమర్పించేందుకు వెసులుబాటు కల్పించాలనే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమస్య పరిష్కారంపై ఏప్రిల్‌లో స్పష్టమైన ఆదేశాలు ఇస్తామని ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్ధిక శాఖ కార్యదర్శి అల్లాడ గౌతమ్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.