పరిసరాల శుభ్రత అందరి బాధ్యత
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:49 PM
పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత అని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షురాలు
గుడిసె కృష్ణమ్మ
ఆదోని, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత అని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ అన్నారు. మంగళవారం పట్టణంలోని తిరుమల నగర్‌లో గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ‘స్వచ్ఛ ఆదోని’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా సమితి సభ్యులతో కలిసి కృష్ణమ్మ పరిసరాలను, మురుగుకాలువలను శుభ్రం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆదోని పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. పరిసరాల శుభ్రత కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు దీనిని తన నైతిక బాధ్యతగా భావించాలన్నారు. శుభ్రమైన వాతావరణం ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ప్రతిఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా తోటి వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వచ్ఛ ఆదోని-ఆరోగ్యకరమైన ఆదోని ధ్యేయంగా ప్రజలందరూ ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు గుడిసె శ్రీరాములు, మురళి, బెస్త ఓంకార్, మల్లికార్జున, బాబురావు, సాధిక్‌వలి, మహాదేవ, రాజశేఖర్, దేవేంద్ర, హనుమంతు, అబ్దుల్లా, చిన్నచిట్టి, పెద్ద చిట్టి, వీరేష్, చంద్ర, అశోక్, కాసీం, ఆంజనేయులు, భాస్కర్, ఉపేంద్ర పాల్గొన్నారు.